Fahadh Faasil | స్టార్ అనిపించుకోవడం కంటే.. గొప్ప నటుడు అనిపించుకోవడంలోనే ఆనందం ఉంది అంటున్నారు మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్. రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన వెల్లడించారు. ‘కెరీర్ ప్రారంభంలో హీరోగా వచ్చిన కొన్ని అవకాశాలను నేనే వదులుకున్నాను. కారణం నా బట్టతల. నాకేమో నాచురల్గా కనిపించడం ఇష్టం.
కానీ సదరు దర్శక,నిర్మాతలు నన్ను విగ్తో నటించమని ఇబ్బంది పెట్టారు. అందుకే ఆ సినిమాలను వదిలేయాల్సి వచ్చింది. నన్ను నాలా చూపించిన సినిమాలే చేశా.’ అంటూ చెప్పుకొచ్చారు ఫహాద్ ఫాజిల్. ‘పుష్ప-2’ గురించి మాట్లాడుతూ ‘అల్లు అర్జున్ పాత్రకు ధీటుగా నా పాత్రను మలిచారు సుకుమార్. ఈ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. తెలుగు నేర్చుకోవడం కాస్త కష్టమైంది. అయినా కసితో నేర్చుకొని డబ్బింగ్ చెప్పా.’ అని తెలిపారు ఫహాద్ ఫాజిల్.