ఫహాద్ ఫాజిల్ మలయాళంలో పెద్ద హీరో. గొప్ప నటుడు కూడా. అందుకే ఆయనుంటే పాత్ర పరంగానూ, బిజినెస్ పరంగానూ సినిమా ప్లస్ అవుతుందని సుకుమార్ ‘పుష్ప’ ఫ్రాచైజీలో ఆయన్ను తీసుకున్నారు. తొలిపార్ట్‌లో ఫహాద్ కేరక్టర్ కొంతే ఉన్నా.. రానున్న ‘పుష్ప 2’లో మాత్రం ఆయన పాత్రే కీలకం. ఇందులో అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ పాత్రలు నువ్వా-నేనా అనేలా ఉంటాయని తెలుస్తున్నది.
ముఖ్యంగా ఫహాద్ పాత్రలో ఊహించని కోణాలు ఉంటాయట. లొకేషన్లో ఫహాద్ నటన చూసి యూనిట్ సభ్యులు మెస్మరైజ్ అయిపోతున్నారట. ఇదిలావుంటే.. ఈ సినిమాకు ఫహాత్ ఫాజిల్ రోజువారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వినికిడి. రోజుకు ఆయన పారితోషికం పన్నెండు లక్షలని తెలుస్తున్నది. అంతేకాదు, తనొచ్చాక పొరపాటున షూటింగ్ కేన్సిల్ అయితే.. పన్నెండుకి ఇంకో రెండు కలిపి, పధ్నాలుగు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారట. ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా నిలిచిన విషయమిది.