Fahadh Faasil | మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘ఆవేశం’. ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనింగ్గా వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదలై సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
అయితే ఓటీటీలో ఈ సినిమాకు వచ్చిన ఆదరణతో ఈ మూవీని ఇతర భాషలలో కూడా డబ్ చేస్తున్నారు. ఇప్పటికే హిందీ వెర్షన్‌కు సంబంధించి పనులు పూర్తవ్వగా ఆవేశం హిందీ వెర్షన్ డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా జూన్ 28వ తేదీన స్ట్రీమింగ్కు రానుంది. అయితే తాజాగా ఈ మూవీని తెలుగులో కూడా తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్ర తమిళ వెర్షన్ కూడా ఇప్పటికే రెడీ అవ్వగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే త్వరలో విడుదల కానున్నట్లు సమాచారం. ఇక దీనితో పాటు తెలుగు వెర్షన్‌ను కూడా మేకర్స్ విడుదల చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘ప్రేమలు’, ‘దిగోట్లైఫ్’ సినిమాల తర్వాత ఆ రేంజ్లో బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ చిత్రం.