F3 Movie Business | ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులందరూ జపిస్తున్న మంత్రం ‘ఎఫ్-3’. 2019లో వచ్చిన ‘ఎఫ్-2’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకీ కామెడీ టైమింగ్, వరుణ్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎఫ్-2 చిత్రమే అంతగా ఎంటర్టైన్ చేస్తే.. ఎఫ్-3 ఇంకెంత ఎంటర్టైన్ చేస్తుందో అని ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సునీల్, సోనాల్ చౌహన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ గ్లింప్స్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. ఈ క్రమంలో ఎఫ్-3 చిత్రానికి భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఏరియా వైజ్ బిజినెస్ గమనిస్తే:
నైజాం : 22.5 కోట్లు
సీడెడ్ : 9.9 కోట్లు
ఉత్తరాంధ్ర : 7.8 కోట్లు
ఈస్ట్ : 5.1 కోట్లు
వెస్ట్ : 4.5 కోట్లు
నెల్లూరు : 2.4 కోట్లు
కృష్ణ : 4.5 కోట్లు
గుంటూరు : 5.4 కోట్లు
తెలంగాణ+ఏపి : 62.1 కోట్లు
ఓవర్సీస్ : 5.5 కోట్లు
కర్ణాటక : 3.6 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ : 76 కోట్లు
‘ఎఫ్-3’ చిత్రానికి రూ.76 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.78 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. వెంకటేష్, వరుణ్‌తేజ్ కెరీర్లో హైయోస్ట్ బిజినెస్ జరిగిన చిత్రంగా ఎఫ్-3 నిలిచింది. కాగా ఎఫ్-2(రూ.34 కోట్లు) చిత్రానికి రెండింతలకు పైగా బిజినెస్ ఈ చిత్రానికి జరిగింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కూడా కనిపించబోతున్నట్లు దిల్ రాజు ఇటీవలే వెల్లడించాడు.