Brad Pitt | హాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ‘ఎఫ్1′(F1) ఒకటి. ఫార్ములా 1 రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బ్రాడ్ పిట్ కథానాయకుడిగా నటిస్తుండగా.. డామ్సన్ ఇడ్రిస్తో పాటు కెర్రీ కాండన్, టోబియాస్ మెన్జీస్, కిమ్ బోద్నియా మరియు జేవియర్ బార్డెమ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జోసెఫ్ కోసిన్స్కీ (Joseph Kosinski) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జెర్రీ బ్రక్‌హైమర్, కోసిన్స్కీ, ఏడుసార్లు ఫార్ములా 1 ఛాంపియన్‌గా నిలిచిన లూయిస్ హామిల్టన్ నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా జూన్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయనిట్.
గతంలో విడుదలైన ఈ మూవీ టీజర్ యాక్షన్ సన్నివేశాలపై దృష్టి సారించగా, ఈ కొత్త ట్రైలర్ మాత్రం రేసింగ్ ప్రపంచంలోని భావోద్వేగాలను లోతుగా చూపించింది. ఈ ట్రైలర్ ప్రధానంగా రిటైర్మెంట్ తర్వాత తిరిగి వస్తున్న మాజీ ఎఫ్1 డ్రైవర్ సోనీ హేస్ (బ్రాడ్ పిట్) కథను, అతని పునరాగమనంపై ఉన్న సందేహాలను హైలైట్ చేసింది.
1990ల్లో ఫార్ములా 1 రేసింగ్‌లో బాగా పేరు తెచ్చుకున్న సోనీ హేస్ (బ్రాడ్ పిట్) అనే డ్రైవర్ ముప్పై ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ రేసింగ్‌లోకి వస్తాడు. కష్టాల్లో ఉన్న ఏపీఎక్స్‌జీపీ (APXGP) అనే కల్పిత టీమ్‌లో యువ డ్రైవర్ జాషువా పియర్స్ (డామ్సన్ ఇడ్రిస్)తో కలిసి పనిచేస్తాడు. ఈ సినిమా ఫార్ములా 1లో ఉండే గెలుపులు, ఓటములు, భయంకరమైన పోటీ, టీమ్‌లో ఉండేవాళ్లే శత్రువులుగా మారే పరిస్థితులు, అలాగే ఒక వ్యక్తి తన తప్పులను సరిదిద్దుకునే ప్రయాణాన్ని చూపించబోతుంది.