F1 Movie | హాలీవుడ్ నుంచి వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం F1 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఫార్ములా 1 రేసింగ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో డామ్సన్ ఇడ్రిస్, కెరీ కాండన్, జావియర్ బార్డెమ్, టోబియాస్ మెంజీస్, సారా నైల్స్, కిమ్ బోడ్నియా, సామ్సన్ కాయో తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాకు విడుదలైన రోజు నుంచే ఇండియాలో విపరీతమైన క్రేజ్ లభించింది. దీంతో పాటు దర్శకుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్.. నటులు ప్రభాస్, విజయ్ దేవరకొండ ఈ సినిమా చూశామని చెప్పడంతో దీనికి మరింత పాపులారిటీ దక్కినట్లయింది. అయితే ఈ సినిమా తాజాగా ఇండియాలో రూ.100 కోట్లు వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇంతకముందు ది లయన్ కింగ్ ఈ అరుదైన ఘనతను సోంతం చేసుకోగా.. ఈ జాబితాలో ఎఫ్1 కూడా చోటు దక్కించుకుంది.
No pit stops. No slowing down. Just full throttle at the Indian Box Office!
Don’t miss #F1TheMovie starring Brad Pitt in cinemas & #IMAX near you.
Book your tickets now: https://t.co/4qLqnHkrachttps://t.co/fc2xfAc9iL#WarnerBrosIndia #BradPitt pic.twitter.com/VVaOIebMog
— Warner Bros. India (@WarnerBrosIndia) July 23, 2025