ఎక్స్ట్రాక్షన్-2
నెట్‌ఫ్లిక్స్: జూన్ 16
తారాగణం: క్రిస్ హెమ్స్‌వర్త్, ఓల్గా కుర్లింకో, గోల్ షిప్టె తదితరులు
దర్శకత్వం: సామ్ హార్గ్రేవ్
చేజింగ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడని వాళ్లుండరు. సస్పెన్స్ ఎలిమెంట్స్ పూర్తిస్థాయిలో పండకపోయినా.. కండ్లుచెదిరే ఫీట్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. క్రిస్ హెమ్స్‌వర్త్ నటించిన ఎక్స్ట్రాక్షన్-2 ఈ తరహా చిత్రమే! ఎక్స్ట్రాక్షన్-1కి మంచి మైలేజీ రావడంతో దానికి కొనసాగింపుగా ఈ చిత్రం నిర్మితమైంది. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమా రికార్డ్ స్ట్రీమింగ్ నమోదుచేస్తున్నది. కథలోకి వెళ్తే టైలర్ రేక్ (క్రిస్ హెమ్స్‌వర్త్) మంచి ఆఫర్ ఇస్తే ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్లు అయినా చేస్తాడు. అంతకుముందు జరిగిన ఒక ఆపరేషన్‌లో చావు అంచుల వరకు వెళ్తాడు రేక్. కొనప్రాణాలతో ఉన్న అతణ్ని స్నేహితులు కాపాడతారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మరో రెస్క్యూ ఆపరేషన్ వస్తుంది. జార్జియాలో మాఫియా డాన్ తమ్ముడు జైలులో ఉంటాడు. శిక్ష పడిన ఖైదీ అయినప్పటికీ సకల సౌకర్యాలూ అనుభవిస్తుంటాడు. తనతోపాటు భార్యాపిల్లలను అక్కడే బందీలుగా ఉంచుకుంటాడు. అతని భార్యాపిల్లలను జైలు నుంచి కాపాడే పని ఒప్పుకొంటాడు రేక్. ఈ ఆపరేషన్‌ను రేక్ పూర్తి చేశాడా, లేదా? అన్నది మిగిలిన కథ!