Extra Ordinary Man | నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ లాంఛ్ టైం, వెన్యూ ఫిక్స్
Extra Ordinary Man | టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) నటిస్తున్న తాజా చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man). నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా(Naa Peru Surya Naa Illu India) ఫేమ్ వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Extra Ordinary Man | టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) నటిస్తున్న తాజా చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man). నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా(Naa Peru Surya Naa Illu India) ఫేమ్ వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తోండగా.. సీనియర్ హీరో రాజశేఖర్(Rajashekar) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్‌తో పాటు డేంజర్ పిల్లా, బ్రష్ వేసుకో పాటలు అభిమానులను ఇంప్రెస్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్‌ను నవంబర్ 27న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు సంబంధించి మేకర్స్ కొత్త అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్ (Prasad PCX Screen) వేదికగా ఉంటుందని తెలిపింది. నితిన్ అభిమానులు https://www.shreyasgroup.net వెబ్ లింక్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు.
Prepare to experience #EXTRA fun with the team of #ExtraOrdinaryMan at the Trailer Launch Event 🤩💥
🗓️ Tomorrow (27th NOV) from 4️⃣ PM
📍Prasads PCX Screen, Hyd.Book Free Event Passes Here:
🎟️ https://t.co/FWdXDkWLTr#ExtraTrailer ❤️🔥#ExtraOrdinary #ExtraOrdinaryManOnDec8th… pic.twitter.com/dAB04Y6i2j— Vamsi Kaka (@vamsikaka) November 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

