Everything Everywhere All at Once Movie | ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగాఎదురు చూసిన 95వ ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరిగాయి. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఆస్కార్ వేడుకలో ఈ సినిమా ఏకంగా ఏడు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను గెలిచి రికార్డు క్రియేట్ చేసింది.
అవార్స్:
ఉత్తమ చిత్రం-ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్‌వన్స్
ఉత్తమ దర్శకుడు-డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్
ఉత్తమ నటి-మిచెల్ యో
ఉత్తమ సహాయ నటుడు-కే హ్యూ క్వాన్
ఉత్తమ సహయ నటి-జామీ లీ కర్టిస్
ఉత్తమ స్క్రీన్‌ప్లే-డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్
ఉత్తమ ఎడిటింగ్-పాల్ రోజర్.