Erra Cheera | హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో రూపొందిన ‘ఎర్రచీర – ది బిగినింగ్’ చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ – శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రానికి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు ఒక ముఖ్య పాత్రలో నటించారు. నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని ఇందులో కీలక పాత్ర పోషించింది.
ఈ చిత్ర దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ సినిమా బిజినెస్ షో చూసిన డిస్ట్రిబ్యూటర్లందరూ కంటెంట్‌కు ఆకర్షితులై సినిమా తీసుకునేందుకు వెంటనే ముందుకు వచ్చారని తెలిపారు. కంటెంట్‌లో డివోషనల్ టచ్ ఉండటం, హారర్ బ్యాక్‌డ్రాప్‌లో మదర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండటంతో దీన్ని దీపావళి కానుకగా వారం ముందుగానే అంటే అక్టోబర్ 10న విడుదల చేయాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. సినిమా ఆలస్యం కావచ్చు కానీ కంటెంట్ మాత్రం ‘ఖతర్నాక్’గా ఉందని చూసిన వారు వెల్లడించారు. ఇది అందరూ కలిసి చూసే కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్‌కి వచ్చి చూడాలి అని సుమన్ బాబు కోరారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై సెన్సార్ సభ్యులు సైతం ప్రశంసలు కురిపించినట్లు చిత్ర బృందం తెలిపింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ అద్భుతంగా హైలైట్ అయ్యాయని సెన్సార్ బృందం అభినందించింది.
ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం, తాజాగా ‘హరిహర వీరమల్లు’ దర్శకుడు జ్యోతి కృష్ణను కలిసి ట్రైలర్‌ను చూపించింది. ఈ సందర్భంగా జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. “ఎర్ర చీర ట్రైలర్ చాలా బాగుంది. సినిమా అక్టోబర్ 10న విడుదల అవుతోంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్లలో చూడాలి” అని కోరుతూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రమోషన్స్ లో భాగంగా అక్టోబర్ 3న రిలీజ్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు అక్టోబర్ 5న విజయవాడలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సుమన్ బాబు తెలిపారు.
ముఖ్య తారాగణం: బేబి సాయి తేజస్విని, సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు తదితరులు.