ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో ఇప్పటికే నాగార్జన, చిరంజీవి హోస్టులుగా తెలుగు బుల్లితెర మీద ప్రసారం అయింది. కానీ.. ఈసారి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ఈ షో రాబోతోంది. ఈ షో జెమినీ టీవీలో ఆగస్టు 22న ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన పలు ప్రోమోలు విడుదలయ్యాయి. తాజాగా కర్టెన్ రైజర్‌ను విడుదల చేశారు. ఆగస్టు 22న ఈ షో ప్రారంభం కాబోతోందని.. మొదటి ఎపిసోడ్లో రామ్ చరణ్ సందడి చేయబోతున్నారని.. హోస్ట్ ఎన్టీఆర్ ట్వీట్ చేసి మొదటి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు.
As we gear up to bring #EMK into your homes from this 22nd, here is a sneak peek of the curtain raiser episode featuring my brother @AlwaysRamCharan. We hope you will have as much fun watching as we had shooting.https://t.co/tNMgirz6Wi@GeminiTV
— Jr NTR (@tarak9999) August 15, 2021
ఆ ప్రోమోలో.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ చేసిన సందడి ఆద్యంతం ఫన్నీగా ఉంటుంది. స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. వెళ్లి హోస్ట్ సీట్లో కూర్చోబోతాడు. దీంతో వెంటనే అడ్డుపడిన జూనియర్ ఎన్టీఆర్.. అది హాట్ సీటు.. ఇది హోస్ట్ సీటు.. అంటూ చెప్పడంతో.. ఓకే అని చెప్పి వెళ్లి హాట్ సీట్లో కూర్చుంటాడు రామ్ చరణ్. ఇక.. రామ్ చరణ్.. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం.. కష్టంగా ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. సీటు హీట్ ఎక్కుతోంది.. బ్రెయిన్ హీట్ ఎక్కుతోంది.. అంటూ ఓ డైలాగ్ విసురుతాడు. మొత్తం మీద బుల్లితెర ప్రేక్షకులను ఓ రేంజ్లో అలరించడానికి.. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ కూడా రెడీ అయిపోయారన్నమాట. ఎవరు మీలో కోటీశ్వరుడు మొదటి ఎపిసోడ్ కోసం.. ఆగస్టు 22, రాత్రి 8.30 వరకు వెయిట్ చేయాల్సిందే.