గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘యుఫోరియా’. విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన తారాగణం. భూమిక ముఖ్య పాత్రను పోషించింది. నీలిమ గుణ నిర్మాత. సోమవారం ఈ సినిమా గ్లింప్స్‌ను నిర్మాతలు దిల్‌రాజు, కె.ఎల్.దామోదరప్రసాద్ రిలీజ్ చేశారు. నేటి యువతకు కనెక్ట్ అయ్యేలా గ్లింప్స్ అదిరిపోయిందని దిల్‌రాజు అన్నారు.
గుణశేఖర్ మాట్లాడుతూ ‘అంతా కొత్తవారితో ఈ సినిమా తీశా. రెండు సంఘటనలు నన్ను బాగా కదలించాయి. వాటి ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. అలాంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి ట్రెండ్ తగినట్లుగా కథ నడుస్తుంది. ప్రతీ సన్నివేశం రియలిస్టిక్‌గా ఉంటుంది. నేటి యువతకు, వారి పేరెంట్స్‌కు మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో కథ నడుస్తుంది’ అన్నారు. థియేటర్ ఆర్టిస్టుల్ని ఈ సినిమా కోసం తీసుకున్నామని నిర్మాత నీలిమ గుణ పేర్కొంది.