సినీ లవర్స్ చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న టాలీవుడ్ (Tollywood) పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి ఆర్ఆర్ఆర్ (RRR) ఒకటి. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ అభిమానుల్లో జోష్ నింపే క్రేజీ అప్డేట్స్ ను అందిస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ నుంచి ఎత్తర జెండా పాటను మార్చి 14న లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించింది టీం.
యంయం కీరవాణి సంగీత సారథ్యంలో కంపోజ్ చేసిన ఎత్తెర జెండా పాట చాలా కలర్ఫుల్లో ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉండబోతుందని తాజా లుక్‌తో తెలిసిపోతుంది. తారక్, రాంచరణ్ పంచె కట్టులో కనిపిస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు. అలియాభట్ లంగావోణిలో కొత్తగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో కొమ్రంభీం పాత్రలో జూ.ఎన్టీఆర్ నటిస్తుండగా..రాంచరణ్ అల్లూరి సీతారామ రాజు రోల్లో నటిస్తున్నాడు.
#RRRMovie to kick off promotions with #RRRCelebrationAnthem from March 14th!#RRRonMarch25th @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @aliaa08 @ajaydevgn @OliviaMorris891 @mmkeeravaani @DVVMovies @RRRMovie #RRRMovie#EttharaJenda #Sholay #Koelae #EtthuvaJenda #EtthukaJenda pic.twitter.com/al1w5EUilm
— BA Raju's Team (@baraju_SuperHit) March 10, 2022
బాలీవుడ్ నటి అలియాభట్, ఒలివియా మొర్రీస్ మరో ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్లు అజయ్ దేవ్గన్, శ్రియాశరణ్, కోలీవుడ్ యాక్టర్ సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది.