విప్లవ్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఈసారైనా’. అశ్విని కథానాయిక. ఈ నెల 8న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ‘ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. ఓ నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతూ, అతని ప్రేమను వెతుక్కునే దిశగా ఎలా సాగాడు? అనే ప్రశ్నకు సమాధానంగా ఈ సినిమా ఉంటుంది. అందరికీ నచ్చేలా తీశాం. నచ్చితేనే సినిమా చూడండి.’ అని విప్లవ్ అన్నారు. ఇంకా కథానాయిక అశ్విని, చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ, సహనిర్మాత సంకీర్త్, నటుడు ప్రదీప్ రాపర్తి తదితరులు మాట్లాడారు.