‘అందరూ కనెక్ట్ అయ్యేలా చక్కని మెసేజ్‌తో ఈ సినిమా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ‘ైప్లె హై..’ పాటతో అందర్నీ అలరించిన సంగీత దర్శకుడు కాలభైరవ.. ఇప్పుడు రెండో పాటతో వచ్చారు. ‘రామ రామ..’ అంటూ సాగే ఈ పాటను చైతన్యప్రసాద్ రాయగా, కాలభైరవ అద్భుతంగా స్వరపరిచారు. అందరూ ఎంజాయ్ చేసేలా ఈ పాట ఉంటుంది. ఈ సినిమా ద్వారా 20మంది కొత్తవాళ్లని పరిచయం చేస్తున్నాం. ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్న విఘ్నేష్ గవిరెడ్డికి ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుంది. భూమిక పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది.’
అని డైరెక్టర్ గుణశేఖర్ అన్నారు. లేట్ నైట్ కల్చర్, డ్రగ్స్ యువతపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలిపే కథాంశంతో రూపొందుతున్న సందేశాత్మక యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘యుఫోరియా’. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో రాగిణి, నీలిమలతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో గుణశేఖర్ మాట్లాడారు. ఈ సినిమా ప్రజల్లో ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుందని, తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదని భూమిక పేర్కొన్నారు. ఇంకా ఎడిటర్ ప్రవీణ్‌పూడి, నిర్మాత నీలిమ గుణ, హీరో విఘ్నేష్ గవిరెడ్డి, రోహిత్ కూడా మాట్లాడారు.