Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే 66 రోజులు పూర్తి చేసుకున్న ఈ షోలో బుధవారం ఎపిసోడ్ పూర్తిగా ఫన్, ఎంటర్టైన్మెంట్తో నిండిపోయింది. బిగ్ బాస్ హౌజ్‌ని రాజ్యంగా మలుస్తూ, హౌజ్‌మేట్స్‌కి కొత్త టాస్క్ ఇచ్చారు. అందులో రీతూ, దివ్య, కళ్యాణ్ రాజులు, రాణులుగా వ్యవహరించగా, ఇమ్మాన్యుయెల్, గౌరవ్, సుమన్ శెట్టి, భరణి ప్రజలుగా, తనూజ, నిఖిల్, సంజనా, డీమాన్ పవన్ కమాండర్లుగా నటించారు. ఈ టాస్క్‌లో రాజులు ప్రజల చేత సేవలు చేయించుకుంటూ వినోదాన్ని పంచారు. ఇమ్మాన్యుయెల్ ముఠామేస్త్రి స్టెప్ వేసి ప్రేక్షకులను అలరించగా, సుమన్ శెట్టి వీణ స్టెప్‌తో నవ్వులు పూయించాడు. భరణి, గౌరవ్లతో కూడిన ఫన్నీ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి.
రీతూ చౌదరి ఈ ఎపిసోడ్లో తన ఫన్నీ యాక్టింగ్‌తో మెప్పించింది. ఇమ్మాన్యుయెల్ దగ్గర పులిహోర కలిపే సీన్లో ఇద్దరి మధ్య రొమాంటిక్ టచ్ ప్రేక్షకులను అలరించింది. దీనిపై కళ్యాణ్ కామెంట్స్ చేయడంతో రాజు, రాణుల మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ చోటు చేసుకుంది. రీతూ, ఇమ్మాన్యుయెల్ల మధ్య జరిగిన ఈ సన్నివేశం సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. టాస్క్‌లో మరో హైలైట్ సీన్ తనూజ – పవన్ మధ్య ఘర్షణ. తనను వెనకనుంచి టచ్ చేశాడని తనూజ ఫైర్ అవ్వగా, పవన్ మాత్రం అపార్ధం చేసుకున్నావని చెప్పాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి హై టెంపరేచర్ సీన్‌గా మారింది.
టాస్క్‌లో కమాండర్లు నిఖిల్, పవన్ మరియు ప్రజలు గౌరవ్, భరణి మధ్య పోటీ జరిగింది. ఇందులో నిఖిల్ తన ప్రతిభతో గెలిచి రాజుగా ప్రమోషన్ పొందాడు. దివ్య ఓడిపోయి కమాండర్‌గా మిగిలిపోయింది. రాజులు, రాణులు, కమాండర్లు, ప్రజలుగా హౌజ్‌మేట్స్ వ్యవహరించిన తీరు ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తింది. ఇమ్మాన్యుయెల్ కామెడీ టైమింగ్, రీతూ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్, సుమన్ శెట్టి ఎంట్రీలు బుధవారం ఎపిసోడ్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి, 66వ రోజు బిగ్ బాస్ హౌజ్ లో పూర్తిగా నవ్వులు పూయించిన రోజుగా నిలిచింది. టాస్క్ కంటే ఫన్నీ మోమెంట్స్ ఎక్కువ ఎంటర్టైన్ చేశాయి!