Emergency Movie | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ బీజేపీ ఎంపీ కంగన రనౌత్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన వివాదాస్పద మూవీ ఎమర్జెన్సీ(Emergency). దివంగత భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ కాలాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రాగా.. కంగనా ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రను పోషించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించింది. మనీకర్ణిక ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 17, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది. దాదాపు రూ.60 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 20 కోట్లు కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా అధికార పార్టీ ప్రాపగాండా(BJP Propaganda Movies) మూవీ అంటూ ట్రోల్ చేయడంతో డిజాస్టార్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీ (Emergency Movie OTT) లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది.
ఈ చిత్రంలో కంగనా రనౌత్ (ఇందిరా గాంధీ)తో పాటు అనుపమ్ ఖేర్ (జయప్రకాశ్ నారాయణ్), శ్రేయస్ తల్పాడే (అటల్ బిహారీ వాజ్‌పేయి), మహిమా చౌదరి (పుపుల్ జయకర్), మిలింద్ సోమన్ (సామ్ మనేక్షా), విశాక్ నాయర్ (సంజయ్ గాంధీ), మరియు దివంగత సతీష్ కౌశిక్ (జగ్జీవన్ రామ్) వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారతదేశంలో 1975 నుండి 1977 వరకు మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ కాలాన్ని ఆధారంగా చేసుకుని తీయబడింది. ఈ సినిమాలో ఇందిరా గాంధీ తన రాజకీయ జీవితంలోని ముఖ్య సంఘటనలు, ఆమె తీసుకున్న నిర్ణయాలు, మరియు ఆ నిర్ణయాల వల్ల దేశంపై ఏర్పడిన ప్రభావాలను సినిమాలో చూపించారు.