లోకేష్ అజ్ల్స్ దర్శకత్వంలో ‘లెవన్’ పేరుతో ఓ రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తెరకెక్కుతున్నది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నవీన్చంద్ర ముఖ్యపాత్రధారి. రేయా హరి కథానాయికగా నటిస్తూ అజ్మల్ఖాన్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 22న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్డేట్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో నవీన్చంద్ర ఇంటెన్స్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకోసం శ్రుతిహాసన్ పాడిన ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్’ సాంగ్ ఇప్పటికే ఆడియన్స్ని అలరిస్తున్నదని, ఆసక్తిని రేకెత్తించే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇదని మేకర్స్ చెబుతున్నారు. శశాంక్, అభిరామి, దిలీపన్, రిత్విక, అడుకలం నరేన్, రవివర్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ అశోక్, సంగీతం: డి.ఇమ్మాన్, సహనిర్మాత: గోపాలకృష్ణ.ఎం, నిర్మాణం: ఏఆర్ ఎంటైర్టెన్మెంట్.