Teja Sajja |‘హను-మాన్’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన యంగ్ హీరో తేజ సజ్జా మరోసారి భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పాపులర్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. ‘Teja Sajja X² PMF’ అనే ట్యాగ్‌లైన్‌తో మేకర్స్ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తూ, ‘‘ఈ కథ రాయలసీమ నుంచి యావత్ ప్రపంచానికి చేరబోతుంది’’ అనే క్యాప్షన్‌తో సినిమాకు గ్లోబల్ స్థాయిలో ఓ వెరైటీ కాన్సెప్ట్ ఉన్నట్లు సూచించారు. లుక్ చూస్తుంటే ఇది కూడా సూపర్ హీరో యూనివర్స్‌లో భాగం అయి ఉండే అవకాశం కనిపిస్తోంది.
‘హను-మాన్’ విజయంతో తేజ సజ్జా సూపర్ హీరోగా ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు మరోసారి అదే నిర్మాణ సంస్థతో భారీ యాక్షన్ ప్రాజెక్ట్ ప్రకటించడంతో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి స్కేలు, విజన్, కథా నేపథ్యం అంతా మరింత పెరిగినట్లు మేకర్స్ సూచిస్తున్నారు. ఇప్పటికే తేజ సజ్జా నటిస్తున్న ‘మిరాయ్’ అనే యాక్షన్ థ్రిల్లర్‌కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇందులో ఆయన ఓ యోధుడిగా కనిపించబోతున్నారు. ప్రోమోషనల్ కంటెంట్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఊపులో తేజ మరో పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడన్న వార్త ఫ్యాన్స్‌ను ఉత్సాహంలో ముంచెత్తుతోంది.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2027 సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇది తేజ సజ్జా కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి. కథ, దర్శకుడు, ఇతర తారాగణానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం. ఇక మిరాయ్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ.జీ. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నాడు. రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా.. మంచు మనోజ్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పురాణాల ప్రకారం, అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత పశ్చాత్తాపంతో తొమ్మిది పవిత్ర గ్రంథాలను సృష్టించాడు. ఈ గ్రంథాలను కాపాడే యోధుల్లో ఒకడిగా తేజ సజ్జ కనిపించనున్నారు.