‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్‌రాజ్, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఈషా’ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘మీరు ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది’ అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్.. హారర్ థ్రిల్లర్ అంశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.
దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్మే స్నేహితులకు ఎదురైన అనూహ్య సంఘటనలు, సవాళ్ల నేపథ్యంలో ట్రైలర్ ఆకట్టుకుంది. సైన్స్‌కు, అతీంద్రియశక్తులకు మధ్య సంఘర్షణ నేపథ్యంలో సాగే కథాంశమిదని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతున్నది. ‘ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే..’ అనే డైలాగ్ సవాలు ఆ తర్వాత ఏం జరుగుతుందోననే ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. నమ్మకానికి, మూఢనమ్మకానికి మధ్య నడిచే సంఘర్షణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని మేకర్స్ తెలిపారు.