గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ నిరుద్యోగ యువకుని ప్రేమప్రయాణమే ప్రధానాంశంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఈసారైనా?!’. విప్లవ్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తూ, నటిస్తున్న ఈ చిత్రంలోని మొదటిపాటను ఇటీవలే మేకర్స్ విడుదల చేశారు.
రాకేందుమౌళి రాసిన ఈ పాటను తేజ్ స్వరపరిచారు. అర్జున్ విజయ్ ఆలపించారు. భావోద్వేగాల మేలుకలయికగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. అశ్విని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: గిరి, సహనిర్మాత: సంకీర్త్ కొండా.