యువతను విశేషంగా ఆకట్టుకున్న సినిమా ‘ఈ నగరానికి ఏమైంది?’. ఈ సినిమా సీక్వెల్ కోసం సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో.. ఎట్టకేలకు సీక్వెల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ‘ENE రిపీట్’ టైటిల్‌తో సీక్వెల్‌ని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ పార్ట్‌లో నటించిన విశ్వక్సేన్, సాయిసుశాంత్రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ఈ సీక్వెల్లో కూడా హంగామా చేయనున్నారు.
ఒరిజినల్ని క్రియేట్ చేసిన తరుణ్‌భాస్కర్ ఈ సీక్వెల్‌ని కూడా తెరకెక్కించబోతున్నారు. డి.సురేశ్‌బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాతలు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ‘ఏళ్లనాటి శని పోయింది.. కన్యారాశి టైమ్ వచ్చింది..’ అనే ట్యాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నది. గాలిలో ఎగిరిపోతున్న బట్టలు, బ్రీఫ్‌కేస్, బీర్ బాటిళ్లు, సన్ గ్లాసెస్, విమాన టికెట్ ఇవన్నీ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: ఏ.జె.ఆరోన్, సంగీతం: వివేక్ సాగర్.