Chuttamalle Song | ఎన్టీఆర్ దేవరలోని చుట్టమల్లే చుట్టేస్తాందే పాటను పాడాడు బ్రిటిష్ ఫేమస్ పాప్ సింగర్ ‘ఎడ్ షీరన్’ (Ed Sheeran). ఎడ్ షీరాన్ (British Pop Singer Ed Shreean) ప్రస్తుతం భారత్ పర్యాటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నైలో తన మ్యూజిక్ కన్సర్ట్లు ఇవ్వగా.. సూపర్ సక్సెస్ అయ్యాయి. తన తర్వాతి కన్సర్ట్ మేఘలయా రాష్ట్రంలోని షిల్లాంగ్తో పాటు ఢిల్లీ, గురుగ్రామ్‌లో ఉన్నాయి.
అయితే ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ సింగర్ షిల్పారావు(Shilpa rao)ని కలిసిన ఎడ్ షీరాన్ తనతో కలిసి చుట్టమల్లే చుట్టేస్తాందే(Chuttamalle chuttestaandi) పాటను ఆలపించాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేవరలోని చుట్టమల్లే పాటను షిల్పారావు పాడిన విషయం తెలిసిందే. ఈ పాటకు అనిరుధ్ సంగీతం అందించాడు.
మరోవైపు ఎడ్ షీరాన్ తెలుగు పాటను ఆలపించడం ఇది రెండోసారి. ఇంతకుముందు అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురములోని బుట్టబోమ్మ పాటకు బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్‌తో కలిసి ఎడ్ షీరాన్ స్టెప్పులేశాడు.
Erasing the boundaries with global reach @tarak9999 @anirudhofficial ❤️
Ed Sheeran & Shilpa Rao performing the sensational #Chuttamalle song from #Devara pic.twitter.com/Hs12zW8YPo
— Vamsi Kaka (@vamsikaka) February 9, 2025
Ed’s first Telugu song with @shilparao11 🤝 pic.twitter.com/7jJh6stkyW
— Ed Sheeran HQ (@edsheeran) February 9, 2025