Ed Sheeran – Buttabomma | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘అలా వైకుంఠపురములో’. 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలోని సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బుట్టబోమ్మ, రాములో రాములా పాటలకైతే లాక్డౌన్లో జనాలు రీల్స్ చేసి వదిలారు. ఇక బుట్టబోమ్మ పాటకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై అల్లు అర్జున్ కూడా స్పందించాడు.
అయితే తాజాగా బుట్టబోమ్మ (Buttabomma) పాటకు హాలీవుడ్ ఫేమస్ సింగర్ ‘ఎడ్ షీరన్’ (Ed Sheeran) డ్యాన్స్ చేశాడు. ఈ పాట పాడిన బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్, ‘ఎడ్ షీరన్’ ఒక పార్టీలో కలువగా.. వీరిద్దరూ కలిసి బుట్టబోమ్మ పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు అల్లుఅర్జున్ క్రేజ్ హాలీవుడ్‌కు పాకుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Ed Sheeran dancing to #ButtaBomma 😱
Telugu (TFI) is truly going Global 🔥#AlluArjun #PoojaHegde #EdSheeran pic.twitter.com/ALwUlpo8JI— Ayyo (@AyyAyy0) March 13, 2024