Vijay Devarakonda | బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నేడు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యలయం ముందుకు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఈ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్స్‌పై ప్రచారం కేసులో దాదాపు నాలుగున్నర గంటలపాటు విచారణ జరుగగా.. ఈ యాప్స్‌లో ప్రమోషన్స్‌లో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ విజయ్ను విచారించినట్లు సమాచారం. అయితే ఈ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు.
బెట్టింగ్ యాప్ కేసులో నా పేరు రావడంతో విచారణకు పిలిచారు. నేను ప్రమోట్ చేసింది గేమింగ్ యాప్స్ మాత్రమే. గేమింగ్ యాప్‌కి, బెట్టింగ్ యాప్‌కి అసలు సంబంధమే లేదు. రెండు వేరు వేరు. గేమింగ్స్ యాప్స్ అనేవి కంప్లీట్‌గా లీగల్. సుప్రీం కోర్టుచే గుర్తించబడినవి. ఇవి టాక్స్ కడతాయి. జీఎస్టీ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఉంటాయి. నా బ్యాంకు లావాదేవీల వివరాలన్నీ ఈడీకి సమర్పించా. నేను ప్రమోట్ చేసిన A23 యాప్ తెలంగాణలో ఓపెన్ కాదు. నేను లీగల్ గేమింగ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశా. దానికి సంబంధించిన ఒప్పందం వివరాలన్నీ ఈడీకి సమర్పించాను అంటూ విజయ్ చెప్పుకోచ్చాడు.
Gaming apps are completely legal..
Recognized by the government..
Licensed as a business..#VijayDeverakonda speaks after the ED Session. pic.twitter.com/hBd3R7y2Iq— Suresh PRO (@SureshPRO_) August 6, 2025
మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్‌ని ఈడీ విచారించగా, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మిలకు కూడా నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).