Dear Comrade | టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో ఆయనకి కింగ్డమ్ చిత్రం కాస్త ఉపశమనం కలిగించింది అనే చెప్పాలి. అయితే కొన్నాళ్ళుగా విజయ్ దేవరకొండని వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి. వాటిలో డియర్ కామ్రేడ్ చిత్రం ఒకటి. కాలేజీలో రాజకీయాలపై ఎదురెళ్లిన నాయకుడు చైతన్య(బాబి)గా విజయ్ దేవరకొండ నటించారు. ధైర్యం, తెగువ చాలా ఎక్కువ. విపరీతమైన కోపం. ఇలాంటి వ్యక్తి ఒక క్రికెట్ ప్లేయర్(రష్మిక మందన)తో ప్రేమలో పడతాడు. ఆ తరవాత ఈ ప్రేమ ప్రయాణం ఎలా సాగింది, చివరకు ఏమైంది అనేదే సినిమా
విజయ్ దేవరకొండ అభిమానులు ఆశించినట్టే సినిమాలో లిప్‌లాక్‌లు, రౌడీ బాయ్ స్టైల్ డైలాగులకు కొదవలేదు. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. మైత్రీ మూవీమేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిందనే చెప్పాలి. గీతా గోవిందం చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం ఇది.
అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని దర్శకుడు కొరియన్ సినిమా నుండి కాపీ కొట్టినట్టు నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోని చూస్తే అర్ధమవుతుంది. సినిమాలోని ఓ పాటలో హీరోయిన్ వ్యాయామం చేస్తుండగా, హీరో వెనక నుండి చూస్తాడు. అప్పుడు హీరోయిన్ కూడా సిగ్గుపడుతుంది. ఈ సీన్‌కి మంచి అప్లాజ్ వచ్చింది. అయితే ఈ సీన్‌ని కొరియన్ సినిమా వన్ ఇన్ ది సమ్మర్ నుండి తీసుకున్నట్టు అర్ధమవుతుంది. ఆ రెండు సీన్స్ సేమ్ టూ సేమ్ ఉండగా, ఈ సీన్‌ని చూసిన నెటిజన్స్ భరత్‌ని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఫ్రెంచ్ కొరియన్ సినిమాలు కూడా వదలడం లేదా అని కామెంట్ చేస్తున్నారు.
This scene was also copied 🫠 pic.twitter.com/lAyltGY8Ux
— 𝙎𝘼𝙍𝘾𝘼𝙎𝙌𝙊 (@sarcasqo) August 12, 2025