Eagle | ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు రవితేజ (Ravi Teja). మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి ఈగల్ (Eagle). ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పాటలపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ధమాకా లాంటి మాస్ సాంగ్ ఉండేలా చూడండి.. సాంగ్స్ మంచి హిట్టవ్వాలంటూ ఓ నెటిజన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ట్వీట్ చేశాడు.
దీనిపై మేకర్స్ స్పందిస్తూ.. ఈగల్ పాటలు విందుభోజనంలా ఉండబోతున్నాయని, చాలా స్పెషల్ సాంగ్స్ కాబోతున్నాయని రీ ట్వీట్ చేసింది. దీంతో రవితేజ ఈ సారి కూడా తన నుంచి అభిమానులు కోరుకుంటున్న ఎనర్జిటిక్ సాంగ్స్‌ను అందించబోతున్నాడని ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈగల్ చిత్రీకరణ ఇటీవలే హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొనసాగింది. రీసెంట్గా కొత్త షెడ్యూల్ కోసం రవితేజ టీం లండన్‌కు పయనమైంది.
రవితేజ రీసెంట్గా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో దిగిన ఫొటోను ఇన్ స్ట్రాగ్రామ్లో షేర్ చేస్తూ.. లండన్‌కు పయనం అని ఈగల్ ఎమోజీని క్యాప్షన్‌గా ఇస్తూ.. నెక్ట్స్ షెడ్యూల్ లండన్‌లో జరుగనున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు. ఈ షెడ్యూల్లో రెండు వారాలపాటు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
ఈగల్ మూవీలో అనుపమపరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కావ్య థాపర్ మరో కీ రోల్ చేస్తోంది. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఈగల్ టైటిల్ అనౌన్స్ మెంట్..
#Eagle movie songs are going to be Feast 🤩 🦅
It’s Definitely Special 🕺@RaviTeja_offl@Karthik_gatta @manibkaranam @sujithkolli https://t.co/dc33g3DDZF— People Media Factory (@peoplemediafcy) August 27, 2023