 
                                                            Prashant Varma | టాలీవుడ్ స్టార్ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth varma) ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకుని సినిమాలు చేయట్లేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిరంజన్ రెడ్డి, సుధాకర్ చెరుకూరి, డి.వి.వి. దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్, హంబలే ఫిల్మ్స్ వంటి టాప్ బ్యానర్లలో సినిమాలు చేస్తానని చెప్పి దాదాపు రూ.100 కోట్లకు పైగా ప్రశాంత్ వర్మ అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ (DVV Entertainment) స్పందించింది. తాము ప్రశాంత్ వర్మ (Prasanth varma)కు ఎలాంటి అడ్వాన్స్ ఇవ్వలేదని తెలిపింది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ లేదా డీవీవీ దానయ్య నుంచి దర్శకుడు ప్రశాంత్ వర్మ అడ్వాన్సులు తీసుకున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ ప్రచారం పూర్తిగా అబద్ధం. దర్శకుడు ప్రశాంత్ వర్మకు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్కు మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరుగలేదు. మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా పేజీలు దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ డీవీవీ దానయ్య లేఖలో తెలిపాడు.
— DVV Entertainment (@DVVMovies) October 31, 2025
 
                            