Dussehra bullodu| దర్శక నిర్మాతలు సినిమాని భారీ వ్యయప్రయాసలు వెచ్చించి రూపొందిస్తుంటారు. ఏ ఒక్క విషయంలో తేడా వచ్చిన కూడా వారి బాధ వర్ణనాతీతం. అయితే అక్కినేని నాగేశ్వర రావు నటించిన దసరా బుల్లోడు సినిమాకి సంబంధించిన నాట్య గీతాన్ని పది రోజుల పాటు తెరకెక్కించారు. కాని తర్వాత చూస్తే ఒక్క సీన్ కూడా రికార్డ్ కాలేదట. వివరాలలోకి వెళితే 1971లో తెలుగు సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన చిత్రం దసరా బుల్లోడు.. వాణిశ్రీ, అక్కినేని నాగేశ్వర రావు జంటగా నటించిన ఈ సినిమాలో నల్లవాడే, అమ్మమ్మ అల్లరి పిల్లవాడు అనే పాట ఓ ఊపు ఊపింది.
నాగేశ్వర రావు వి.బీ రాజేంద్రప్రసాద్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం గోల్డెన్ జూబ్లీ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో గ్రామీణ వాతావరణంతో పాటు బావ మరదళ్ళు సరదాలు, మావయ్యలను వేళాకోలం చేసే అల్లుళ్ళు, మమకారాలు, ఆధిపత్వాలు, అహంకారులు, అభిమానం అన్నీ కూడా ఈ చిత్రంలో చాలా అందంగా కనిపిస్తాయి. అప్పట్లో థియేటర్లలో ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇందులోని కడవెత్తుకొచ్చిందీ కన్నె పిల్ల అనే పాట ఇప్పటికీ ఎక్కడో ఓ చోట మారుమోగుతూనే ఉంది. అంతేకాక వాణిశ్రీతో కలిసి చెంగావి రంగు చీర కట్టుకున్న అనే పాటకు అక్కినేని చేసిన నృత్యం ప్రతి ఒక్కరి మనసులని కూడా దోచేసింది.
అయితే దసరా బుల్లోడులో ఎల్లయ్యగారి మలయ్య అనే నాట్యగీతం ఉండగా, ఈ సాంగ్ షూటింగ్ మచిలిపట్నం సమీపంలోని బట్ల పెనుమర్రు అనే ఊరిలో షూట్ చేశారు. ఇక సినిమా షూటింగ్ సమయంలో ఎవరు ఇబ్బంది పడకూడదని నిర్మాత ఊరిలో టాయ్లెట్స్, బట్టలు మార్చుకోవడానికి గదులు కూడా కట్టించారు. వారం, పది రోజుల పాటు చిత్ర షూటింగ్ సాగింది. ఇక షూటింగ్ పూర్తి చేశాక మద్రాసు చేరాక ఔట్పుట్ చూస్తే కెమెరా సమస్య వలన బొమ్మ రాలేదు. పెద్ద నష్టమే జరిగింది. చేసేదేమి లేక దర్శక నిర్మాత అయిన విబి రాజేంద్ర ప్రసాద్ మళ్లీ అందరి ఆర్టిస్టుల దగ్గర డేట్స్ తీసుకొని మళ్లీ అదే ఊరు పెట్టి కొంత ఖర్చు చేసి విజయవంతంగా షూటింగ్ పూర్తి చేశారు. ఇక సక్సెస్ ఫుల్గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 30 థియేటర్లలో విడుదలైంది. 29 థియేటర్లలో అర్ధశతదినోత్సవం జరుపుకుంది. 21 థియేటర్లలో డైరెక్టుగా, కర్నూల్లో షిఫ్ట్ మీద శతదినోత్సవం జరుపుకుంది.