‘సీతారామం’ చిత్రంతో నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఇటీవల ధనుష్ హీరోగా ‘సార్’ చిత్రంతో విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన మరో తెలుగు సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
సాయి సౌజన్య, ఎస్ నాగవంశీ నిర్మాతలు. ఈ ప్రాజెక్ట్ను ఆదివారం చిత్రబృందం ప్రకటించారు. అక్టోబర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.