‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు యువ హీరో దుల్కర్ సల్మాన్. రామ్ పాత్రలో ఆయన నటన అందరిని ఆకట్టుకుంది. తాజాగా ఆయన మరో తెలుగు చిత్రానికి అంగీకరించారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కించబోతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తారని సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఇటీవల విడుదలైన ‘సార్’ చిత్రంతో దర్శకుడు వెంకీ అట్లూరి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్-వెంకీ అట్లూరి కాంబో ఆసక్తిని పెంచుతున్నది.