Sita Ramam | మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ పరిచయం అక్కర్లేని పేరు. ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ ‘మహానటి’ సినిమాతో దగ్గరయ్యాడు. మహానటి తర్వాత ఈయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఈయన తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇదివరకే విడుదలైన ప్రచార చిత్రాలు, హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్ టీజర్లు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మెలోడి సాంగ్‌ను విడుదల చేశారు.
‘ఓ సీతా .. వదలనిక తోడవుతా.. రోజంతా వెలుగులిడు నీడవుతా’ అంటూ సాగే ఈ మెలోడియస్ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన ఈ పాటను తనే స్వయంగా ఆలపించాడు. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్నదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. రష్మిక మందన్నా, మృనాల్ తాకూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించగా మృనాల్ సీత పాత్రలో నటిస్తుంది. రష్మిక కాశ్మీరి ముస్లిం అమ్మాయిలా నటిస్తుంది.