Lucky Bhaskar | మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లక్కీ భాస్కర్ (Lucky Bhaskar). గత ఏడాది ‘సార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటించింది. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే రూ. 30 కోట్లకు పైగా ఈ చిత్రం వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వెళ్లింది లక్కీ భాస్కర్ టీం.
అయితే ఈ షోలో దుల్కర్ సల్మాన్ దగ్గర ఉన్న కార్ల గురించి అసలు సీక్రెట్‌ను బయట పెట్టాడు దర్శకుడు వెంకీ అట్లూరి. కార్లు అంటే పిచ్చి ఉన్న దుల్కర్ వద్ద మొత్తం 70 లగ్జరీ కార్లు ఉన్నట్లు వెంకీ బాలయ్యకు వెల్లడించాడు. అంతేగాకుండా ఈ కార్లను ఇంట్లో ఉంటే తిడతారని కేరళలో కొన్ని హైదరాబాద్‌లో కొన్ని పెట్టినట్లు వెల్లడించాడు. ఇక లక్కీ భాస్కర్లో వాడిన వింటేజ్ మోడల్ కారు నిస్సాన్ కూడా దుల్కర్దేనని వెంకీ తెలిపాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.