‘మహానటి’ ‘ ‘సీతారామం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన మలయాళంతో పాటు తెలుగు ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఆయన కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైనర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ‘లక్కీ భాస్కర్’ ఆగస్ట్ 15న విడుదలకానుంది. ‘కల్కి’లో ఆయన గెస్ట్రోల్ని పోషించారు.
ఇదిలావుండగా దుల్కర్ సల్మాన్ మరో తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. పవన్ సాధినేని దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించనుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుందని సమాచారం. ‘మహానటి’ ‘సీతారామం’ ‘కల్కి’ తర్వాత దుల్కర్ సల్మాన్ మరోసారి వైజయంతీ మూవీస్‌లోనే సినిమా చేయబోతుండటం విశేషం.