Dulquer Salmaan Kaantha | మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), దగ్గుబాటి రానా (Daggubati Raana) మల్టీస్టారర్‌గా వస్తున్న చిత్రం ‘కాంత’. ఈ సినిమాకు తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. సముద్రఖని (Samuthirakani) కీలక పాత్రలో నటిస్తున్నాడు. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1950 మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. ఈ చిత్రం నవంబరు 14న (Kaantha Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేశారు.