అగ్ర కథానాయకుడు దుల్కర్ సల్మాన్ హీరోగా, నహాస్ హిదాయత్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘ఐ యామ్ గేమ్’ ప్రారంభోత్సవం కేరళ తిరువనంతపురంలో పూజాకార్యక్రమాలతో ఘనంగా జరిగింది. తన సొంత నిర్మాణ సంస్థ వేఫారర్ ఫిల్మ్స్ పతాకంపై దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ ప్రారంభోత్సవానికి సినిమాలోని ప్రధాన తారాగణమంతా హాజరయ్యారు. హీరోగా దుల్కర్ సల్మాన్‌కి ఇది 40వ సినిమా కావడం విశేషం. తొలి షెడ్యూల్ త్రివేండ్రంలోనే కొనసాగుతుందని, దుల్కర్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రంగా ఈ సినిమా ఉండబోతున్నదని మేకర్స్ తెలిపారు. యాంటోని వర్గీస్, తమిళ దర్శకుడు, నటుడు మిస్కిన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: జిమ్షీ ఖలీద్, సంగీతం: జేక్స్ బిజోయ్.