Sita Ramam Review | సీతారామం రివ్యూ..
దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాస్త విరామం తర్వాత "సీతారామం" (Sita Ramam) ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.రొమాంటిక్ హీరోగా దక్షిణాదిలో తిరుగులేని ఇమేజ్ ఉన్న దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కథానాయకుడిగా నటించడంతో ఈ సినిమా నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, భూమిక, సచిన్ఖేడ్కర్, వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు
కెమెరా: పీఎస్ వినోద్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సమర్పణ : వైజయంతీ మూవీస్
నిర్మాణ సంస్థ: స్వప్న సినిమా
నిర్మాత: అశ్వనీదత్
దర్శకత్వం: హను రాఘవపూడి
అందాల రాక్షసి, పడి పడి లేచె మనసు వంటి చిత్రాలతో సున్నితమైన భావాలతో అందమైన ప్రేమ కథల్ని రూపొందిస్తారనే పేరు తెచ్చుకున్నారు దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi). కాస్త విరామం తర్వాత ఆయన “సీతారామం” (Sita Ramam) ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన సినిమా కావడం, రొమాంటిక్ హీరోగా దక్షిణాదిలో తిరుగులేని ఇమేజ్ ఉన్న దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కథానాయకుడిగా నటించడంతో ఈ సినిమా నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. పాటలు, ట్రైలర్ మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. పాజిటివ్ బజ్‌తో రిలీజ్ అయిన “సీతారామం” ప్రేక్షకుల్ని ఎంత వరకు మెప్పించిందో చూద్దాం.
కథ గురించి..
లెఫ్ట్‌నెంట్ రామ్ ఓ అనాథ. కశ్మీర్లో సైనికుడిగా పనిచేస్తుంటాడు. దేశం పట్ల విధేయత, మానవత్వంపై మమకారంతో విధులు నిర్వర్తిస్తుంటాడు. పాకిస్థాన్ ఉగ్రవాదులు వేసే పన్నాగాలను తిప్పి కొడుతూ తన దేశభక్తిని చాటుతుంటాడు. అనాథ అయిన అతనికి సీతామహాలక్ష్మీ పేరుతో ఉత్తరాలు వస్తుంటాయి. తిరిగి జవాబు రాద్దామంటే ఆ ఉత్తరాలకు చిరునామా ఉండదు. ఈ నేపథ్యంలో సీతామహాలక్ష్మి ని వెతికి పట్టుకుంటాడు రామ్. హైదరాబాద్‌లో వారి పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది.
పెళ్లి చేసుకుందామనుకుంటున్న తరుణంలో వారిద్దరికి అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. ఇద్దరు విడిపోతారు. రామ్ కశ్మీర్ వెళ్లిపోతాడు. అనంతరం రామ్ ఓ మిలిటరీ ఆపరేషన్ నిమిత్తం పాకిస్థాన్ భూభాగంలోకి అడుగుపెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీత కోసం రామ్ రాసిన ఉత్తరాన్ని చేరవేసే బాధ్యతను అఫ్రిన్ (రష్మిక మందన్న) ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది? ఇరవై ఏళ్ల అనంతరం సీతను చేరిన ఆ ఉత్తరంలో ఏముంది? ఈ ప్రశ్నలకు సమాధానంగానే మిగతా కథ నడుస్తుంది.
ఎలా ఉందంటే..
యుద్ధంతో రాసిన ప్రేమకథ అన్నది ఈ సినిమా ట్యాగ్‌లైన్. దానిని జస్టిఫై చేస్తూ ప్రేమ, యుద్ధం, దేశభక్తి అంశాల్ని సరైన మోతాదులో కలబోసి ఓ అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు హను రాఘవపూడి. పాకిస్థాన్ తీవ్రవాదుల దుశ్చర్యలను వమ్ము చేసే భారతీయ సైనికుల నేపథ్యంలో కథను ఆరభించడం ఉద్వేగాన్ని పంచుతుంది. సైనికుడి రామ్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూ ఆ యుద్ధ సన్నివేశాల్ని నడిపించారు. ఎప్పుడైతే రామ్..సీతామహాలక్ష్మీనుంచి ఉత్తరాలు స్వీకరించడం మొదలవుతుందో అక్కడే ప్రేమకథకు అంకురార్పణ జరుగుతుంది.
సీతామహాలక్ష్మీని వెతుక్కుంటూ రామ్ హైదరాబాద్ రావడం, అక్కడ వారి పరిచయ ఘట్టాలు చక్కటి పొయెటిక్ ఫీల్‌తో సాగుతాయి. తెరపై అందమైన కవిత రాస్తున్న చందంగా ఆ సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. పెళ్లి విషయంలో సీత సందిగ్ధ పరిస్థితుల్లో ఉండటం, రామ్ తిరిగి కశ్మీర్‌కు పయనం కావడంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. సీత నేపథ్యమేమిటో రామ్‌కు తెలియకుండా ఉంచడం సస్పెన్స్‌ను పంచుతుంది.

ఉత్తరాన్ని పట్టుకొని అఫ్రిన్ సీత కోసం అన్వేషించడం, ఆమె కలుసుకన్న వ్యక్తుల దృష్టికోణం నుంచి ఈ కథను ఆసక్తికరంగా నడిపించాడు దర్శకుడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో కథపై మరింత ఆసక్తిని పెంచారు. 1965 నుంచి 1985 వరకు జరిగే కథ ఇది. నాటి స్థలకాలమాన పరిస్థితుల్ని యథాతధంగా ఆవిష్కరించారు. ఆనాటి కాలంలోని ప్రేక్షకుల్ని తీసుకెళ్లారనే భావన కలుగుతుంది. ద్వితీయార్థంలో కథ ఆసాంతం భావోద్వేగభరితంగా సాగుతుంది.
ఈ కథలో ప్రేమ, యుద్ధం, అన్వేషణ అంశాల్నిఅల్లుకున్న తీరు హృద్యంగా అనిపిస్తుంది. ఈ ప్రేమకథను అనేకమైన ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు హను రాఘవపూడి. పతాక ఘట్టాలు హృదయాన్ని కదిలిస్తాయి. ప్రేక్షకులకు కన్నీరు తెప్పిస్తూ ఎమోషనల్ క్లైమాక్్సతో కథను ముగించారు. చాలా కాలం తర్వాత మనసును కదిలించిన ప్రేమకథను చూశామనే భావనకు లోనవుతారు ప్రేక్షకులు.
నటీనటుల పర్ఫార్మెన్స్..
దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో జీవించారు. దేశభక్తి కలిగిన సైనికుడిగా, సీతను ప్రాణప్రదంగా ప్రేమించే రామ్‌గా భిన్న కోణాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. హృద్యమైన కథతో పాటు దుల్కర్ నటన ఈ సినిమాకు ప్రధానబలంగా నిలిచింది. మృణాల్‌ఠాకూర్ అందంగా కనిపించింది. కళ్లతోనే చక్కటి భావాల్ని పలికించింది. సీత పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. తెలుగులో ఆమెకిది పర్ఫెక్ట్ డెబ్యూగా చెప్పొచ్చు. ఇక ప్రేమికులను కలిపే వారధిగా రష్మిక మందన్న నటన బాగుంది. సుమంత్ ఆర్మీ అధికారి విష్ణుశర్మగా కథాగమనంలో కీలకమైన పాత్రలో మెప్పించారు.

మిగతా నటీనటులు తమ పరిధుల మేరకు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా ప్రతి విభాగంలో ఉన్నతంగా అనిపిస్తుందీ చిత్రం. ఛాయాగ్రహణం కశ్మీర్ అందాల్ని అద్బుతంగా ఒడిసిపట్టింది. కవితాత్మక భావల కలబోతగా కొన్ని సంభాషణలు బాగున్నాయి. విశాల్‌చంద్రశేఖర్ పాటలు మెలోడియస్గా ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. ఇక నిర్మాణపరంగా వైజయంతీ మూవీస్ ప్రమాణాలేమిటో ప్రతిఫ్రేమ్లో కనిపించాయి.
తీర్పు:
ఈ మధ్యకాలంలో హృదయాన్నిటచ్ చేసే ప్రేమకథా చిత్రాలు రావడం చాలా తగ్గిపోయింది. ఆ లోటును భర్తీచేస్తుందీ చిత్రం. వెండితెరపై ఓ అందమైన, కళ్లు చెమర్చే ప్రేమకథను చూశామనే అనుభూతి మిగిలిపోతుంది.
రేటింగ్: 3.25/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

