Kotha Lokah | ఇటీవల థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న మలయాళ చిత్రం ‘లోక చాప్టర్ 1 చంద్ర’ (Lokah Chapter 1 Chandra). తెలుగులో ఈ సినిమాను ‘కొత్త లోక’ పేరుతో విడుదల చేశారు. కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), నస్లేన్ (Naslen) ప్రధాన పాత్రల్లో నటించగా.. డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహారించాడు. ఆగష్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక డైలాగ్ విషయంలో కన్నడ ప్రజలకు ఆగ్రహానికి గురయ్యారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో విలన్ మాట్లాడుతూ.. ఒక ప్రాంతంకి(బెంగళూరు) చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోను ఎందుకంటే వాళ్లు వ్యక్తిత్వం లేనివాళ్లంటూ ఒక డైలాగ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కాకుండా ఈ సినిమాలో దగర్(Prostitute) అనే పదం వాడినట్లు తెలుస్తుంది. దీంతో ఈ వివాదం ముదురుతుండగా.. తాజాగా దీనిపై క్షమాపణలు తెలిపాడు చిత్ర నిర్మాత దుల్కర్ సల్మాన్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాడు.
‘లోక చాప్టర్ 1 చంద్ర’ (Lokah Chapter 1 Chandra) సినిమాలోని ఒక డైలాగ్ కర్ణాటక ప్రజల మనోభావాలను అనుకోకుండా దెబ్బతీసిందని మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో మేము చింతిస్తున్నాము. మేము ప్రజల మనోభావాలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. ఎవరినీ బాధపెట్టే ఉద్దేశ్యం మాకు లేదు. ఈ సినిమాలో ఉన్న ఆ వివాదాస్పదమైన సంభాషణను వీలైనంత త్వరగా తొలగించడం లేదా మార్చడం జరుగుతుంది. మేము కలిగించిన ఈ ఇబ్బందికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాము. దయచేసి మా క్షమాపణను అంగీకరించమని కోరుతున్నాము. అంటూ వేఫరర్ ఫిల్మ్స్ రాసుకోచ్చింది.
#Lokah pic.twitter.com/q18SX8dh7G
— Wayfarer Films (@DQsWayfarerFilm) September 2, 2025