ఉత్తరం నుంచే ఈ కథ పుట్టింది!
“సీతా రామం’ నా కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమా. కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి. ప్రేక్షకులకు ఉత్కంఠను పంచే చాలా అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి’ అని చెప్పారు హను రాఘువపూడి. ఆయన దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతా రామం’ ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు హను రాఘవపూడి శనివారం పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
సీతా రామం కథకు ప్రేరణ ఏమైనా ఉందా?
నాకు పుస్తకాలు చదివే అలవాటుంది. చాలా ఏళ్లక్రితం కోఠి సెకండ్‌హ్యాండ్ బుక్ మార్కెట్లో ఓ పుస్తకం కొన్నా. అందులో ఓపెన్ చేయని ఓ ఉత్తరం కనిపించింది. ఓ అబ్బాయికి వాళ్ల అమ్మ రాసిన ఉత్తరం అది. వాస్తవానికి ఆ లెటర్లో పెద్దగా విషయం ఏమీ లేదు. ఒకవేళ అందులో అతిముఖ్యమైన విషయం ఏమైనా రాసి ఉంటే ఏం జరిగి ఉండేదనే ఊహ నుంచి ఈ కథ రాసుకున్నా. ఓ చిన్న సమాచారం కూడా మనిషి భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. ఈ పాయింట్ చుట్టూ సినిమా కథ అల్లుకున్నా.
తెలుగు హీరోను కాకుండా దుల్కర్ సల్మాన్‌ను ఎంచుకోవడానికి కారణమేమిటి?
ఇతర భాషల్లో బిజినెస్‌ను దృష్టిలో ఉంచుకొని దుల్కర్‌ను హీరోగా తీసుకోలేదు. ఈ కథ రాసుకున్నప్పుడు నా మనసులో ఏ హీరోను అనుకోలేదు. కథానుగుణంగా మంచి పాపులారిటీ ఉన్న హీరో అయితే బాగుంటుందనుకున్నాం. ఆ టైమ్‌లో తెలుగు హీరోలు చాలా బిజీగా ఉండటంతో దుల్కర్ సల్మాన్‌ను ఎంపిక చేసుకున్నాం.
ఈ సినిమాకు ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనే క్యాప్షన్ పెట్టడానికి కారణమేమిటి?
ఈ ప్రేమకథలో యుద్ధ నేపథ్యం ఉండదు. అందుకే యుద్ధంతో రాసిన ప్రేమకథ అని క్యాప్షన్ పెట్టాం. ఈ కథలో ఫిజికల్ వార్‌ను చూపించలేదు. కనిపించని ఓ మానసిక యుద్ధం ఉంటుంది. ప్రతి పాత్ర ఓ సంఘర్షణాత్మక యుద్ధం చేస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే.. రావణసంహారం చేయడానికి రాముడు చేసిన ప్రయాణంలో అంతిమ యుద్ధ ఘట్టం కంటే సీత కోసం జరిపిన గొప్ప అన్వేషణ, సంఘర్షణ ఉద్వేగాల్ని కలిగిస్తుంది. ఆ తరహా యుద్ధమే సీతా రామంలో కనిపిస్తుంది.
దుల్కర్ సల్మాన్ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయి?
టీజర్లో చూపించినట్లు హీరో రామ్ ఓ అనాథ. కశ్మీర్లో సైనికుడిగా పనిచేస్తుంటాడు. రెడీయోలో ఆయన గురించి ఓ కార్యక్రమం ప్రసారం అవుతుంది. అది విన్న చాలా మంది అతనికి ఉత్తరాలు రాస్తారు. అందులో ఓ లెటర్ రామ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ లెటర్ ఏమిటి? అందులో ఏముందన్నదే ‘సీతా రామం’ కథ.
ఉత్తరం నేపథ్యంలో కథను నడిపించడం క్లిష్టంగా అనిపించలేదా?
ఉత్తరం అంటే గొప్ప భావోద్వేగం. వెనకటి రోజుల్లో ప్రేమకథలు హృద్యంగా ఉండటానికి ఉత్తరాలే కారణం. ప్రస్తుత సాంకేతిక యుగంలో ఉత్తరం తాలూకు మ్యాజిక్ మిస్ అయిపోయాం. ‘సీతా రామం’ కథ 1965 నేపథ్యంలో నడుస్తుంది కాబట్టి ఉత్తరం అనే ఎమోషన్ అందరికి కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమాలో రష్మిక మందన్న పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది?
కథను మలుపు తిప్పే పాత్రలో రష్మిక మందన్న కనిపిస్తుంది. ప్రేమికులను కలిపే వారధిలా ఆమె పాత్ర ఉంటుంది.
మీ తదుపరి చిత్రాల గురించి..?
బాలీవుడ్లో సన్నీడియోల్, నవాజుద్దీన్ సిద్ధిఖీతో ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నా. అమెజాన్‌లో ఓ వెబ్‌సిరీస్ చేసే ఆలోచన కూడా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

