దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 40వ చిత్రం ‘ఐయామ్ గేమ్’. నహాస్ హిదాయత్ దర్శకుడు. స్పోర్ట్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ సినిమా గురించి దుల్కర్ సల్మాన్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన కెరీర్లో ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో అత్యంత ైస్టెలిష్ చిత్రమిదని అన్నారు.
తన పాత్రతో పాటు సినిమా తాలూకు కథాప్రపంచాన్ని వినూత్నంగా డిజైన్ చేశారని తెలిపారు. తన పాత్ర కూడా మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందన్నారు. ‘లోక’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత స్వీయ నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిలిమ్స్ పతాకంపై దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆంటోని వర్గీస్, మైస్కిన్, కయాదు లోహర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, దర్శకత్వం: నహాస్ హిదాయత్.