దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘కాంత’. మద్రాస్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామా ఇది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. ఈ నెల 14న విడుదలకానుంది. గురువారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. హీరో, దర్శకుడి మధ్య సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్ ఆకట్టుకుంది. హీరోగా దుల్కర్ సల్మాన్, దర్శకుడిగా సముద్రఖని నటించారు.
వీరిద్దరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కాంత’ విషయంలో చోటుచేసుకునే ఈగో క్లాష్‌తో ట్రైలర్ ఉత్కంఠను పంచింది. పోలీస్ ఆఫీసర్‌గా రానా కనిపించారు. తనకు క్లోజ్‌ఫ్రెండ్ అయిన రానాతో కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని దుల్కర్ సల్మాన్ అన్నారు. కథ విన్న వెంటనే తప్పకుండా సినిమా చేయాలనిపించిందని రానా తెలిపారు. వేఫేర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా పతాకాలపై దుల్కర్ సల్మాన్, రానా చిత్రాన్ని నిర్మించారు.