లవ్‌టుడే, డ్రాగన్ చిత్రాల ఫేం ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘డ్యూడ్’. ‘ప్రేమలు’ఫేం మమిత బైజూ కథానాయిక. కీర్తిశ్వరన్ దర్శకుడు. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఆదివారం కథానాయిక మమితా బైజు పుట్టినరోజు సందర్భంగా, ఆమెకు శుభాకాంక్షలు అందిస్తూ..
ఇందులో ఆమె పోషిస్తున్న ‘కురళ్’ పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. బ్యూటీ అడ్ చార్మ్‌తో యువతను ఆకట్టుకునేలా ఈ పోస్టర్లో మమిత బైజు కనిపిస్తున్నారు. శరత్‌కుమార్, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, సంగీతం: సాయి అభ్యంకర్.