Megastar Chiranjeevi Vishwambhara | 90ల్లో చిరంజీవి లుక్‌ని ఆనాటి యూత్ ఓ రేంజ్లో ఆరాధించారు. అప్పట్లో ఆయన హెయిర్ ైస్టెల్నీ.. ఆయన డ్రెస్సింగ్ ైస్టెల్నీ ఫాలో అవ్వని కుర్రాడు లేడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న ‘విశ్వంభర’లో మెగాస్టార్ మళ్లీ అలా కనిపించనున్నారట. ఈ లుక్ కోసం ఆయన భారీగా బరువు తగ్గడం విశేషం. అంతేకాదు, ఆనాటి హెయిర్ ైస్టెల్‌ని సరిగ్గా అలాగే డిజైన్ చేయించారట దర్శకుడు వశిష్ఠ.
లొకేషన్లో అందరూ అప్పటి చిరంజీవిని చూస్తున్న ఫీల్‌ని ఎంజాయ్ చేస్తున్నారట. ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ ఏడెకరాల్లో ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు వచ్చిన చిరంజీవిని చూసి అక్కడందరూ షాక్‌కి గురవుతున్నారట.
ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేయనున్నారు. టీజర్ కట్ ఇప్పటికే పూర్తయింది. కీరవాణి నేపథ్య సంగీతం, ఫైనల్ ఎడిట్ మాత్రమే మిగిలివుంది. ఈ టీజర్లో చిరు లుక్, విజువల్స్, వశిష్ఠ ఆవిష్కరించిన కొత్త లోకాలు.. ఆడియన్స్‌ని కట్టిపడేస్తాయని సమాచారం.