Drushyam2 On Prime: దృశ్యం 2 కూడా ఓటీటీలోనే .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘దృశ్యం’ తెలుగులో రీమేక్ అయి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రలలో శ్రీ పియ ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఆ తర్వాత మోహన్ లాల్ ‘దృశ్యం -2’ చేశారు. దీనిని కూడా తెలుగులో రీమేక్ చేయాలని భావించిన వెంకటేశ్, మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసఫ్ నే ఎంపిక చేసుకున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లో విడుదల అవుతుందా లేక ఓటీటీలో రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. -చదవండి : నేనున్నా అన్నా అంటూ ధైర్యం చెప్పిన ఎన్టీఆర్
తాజాగా వెంకటేష్ టీజర్ విడుదల చేస్తూ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయనున్నట్టు పేర్కొన్నారు. నవంబర్ 25న ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. రాంబాబు కేసు ఏమైందనే దానిపై ఆ రోజు క్లారిటీ రానుందని తెలియజేశాడు. వెంకటేశ్ నటించిన మరో సినిమా ‘నారప్ప’ను ఓటీటీలో విడుదల చేయడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఊహించని విధంగా పంపిణీదారుల నుండి సురేశ్ బాబు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పైగా ‘నారప్ప’ సినిమాకూ పెద్దంత పాజిటివ్ టాక్ రాలేదు. దీంతో దృశ్యం2 సినిమా థియేటర్స్‌లోనే విడుదల అవుతుందని అందరు అనుకున్నారు. కాని ఊహించని విధంగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు.
The truth has begun to unveil itself. But the question is – has it left a permanent scar on Rambabu?
— Venkatesh Daggubati (@VenkyMama) November 12, 2021
Watch #Drushyam2OnPrime, Nov. 25 on @PrimeVideoIN
▶️https://t.co/mL68iUtwzC#MeenaSagar #JeetuJoseph @SureshProdns @aashirvadcinema @antonypbvr @anuprubens #SatheeshKurup pic.twitter.com/YTkirX6oBH
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

