మలయాళం సూపర్ హిట్ మూవీ దృశ్యం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి మంచి విజయం అందుకున్నాడు వెంకటేష్. ఈ క్రమంలో దృశ్యం 2 చిత్రాన్ని కూడా రీమేక్ చేశాడు. మలయాళంలో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో నటించగా, తెలుగులో వెంకటేశ్, మీనా లీడ్ రోల్లో కనింపిచనున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో డి. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయనున్నట్టు సమాచారం.
ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని సెప్టెంబర్ 20న ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నామని మేకర్స్ పేర్కొన్నారు. ఫస్ట్ లుక్ వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి చిత్ర బృందం పెద్ద షాక్ ఇచ్చింది. కొన్ని అనుకోని ఊహించని పరిణామాల రీత్యా ఈరోజు రిలీజ్ చేస్తామన్న దృశ్యం 2 ఫస్ట్ లుక్ పోస్టర్ ని వాయిదా వేస్తున్నామని, ఈ అసౌకర్యానికి చింతున్నామని తెలియజేస్తూ సారీ చెప్పారు.
దృశ్యం 2 చిత్రంలో మీనా, ఎస్తర్ అనీల్ తదితరులు నటించగా సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఆశీర్వాద్ సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. వెంకటేష్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 2 చాలా తొందరగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
Due to unforeseen circumstances, the release of the first look of Drushyam 2 has been delayed. Sorry for the inconvenience.
— Suresh Productions (@SureshProdns) September 20, 2021