మలయాళ చిత్రాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. అక్కడి సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో వాటిని తెలుగు, హిందీతో పాటు పలు భాషలలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగులో చాలా మలయాళ చిత్రాలు రీమేక్ దశలో ఉన్నాయి. ఇక హిందీలో కూడా 2019లో విడుదలైన మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైనెస్స్’ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటన్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ అనే మలయాళ చిత్రంలో స్టార్ హీరోగా పృధ్వీరాజ్ నటించగా, అతని అభిమాని, ఆర్టీఓ ఆఫీసర్ పాత్రను సూరజ్ వెంజరమూడు పోషించాడు. ఓ సూపర్ స్టార్, అతని అభిమాని అయిన ఆర్టీఓ అధికారి మధ్య ఊహించని విధంగా ఏర్పడిన ఇగో క్లాష్ వారి జీవితాలను అతలాకుతలం చేస్తుంది అనే సున్నితమైన పాయింట్‌తో జీన్ పాల్ లాల్ చిత్రాన్ని తెరకెక్కించాడు.
‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా హిందీ రీమేక్ లో అక్షయ్ కుమార్ స్టార్ గా నటిస్తుండగా, అభిమాని పాత్రకు ఇమ్రాన్ హష్మీని తాజాగా ఎంపిక చేశారు. ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తొలిసారిగా ఈ సినిమాతో వెండితెరపై కలిసి కనిపించనున్నారు అక్షయ్, ఇమ్మాన్. జనవరిలో సినిమా షూటింగ్ ను ప్రారంభించి, నలభై రోజుల్లో యు.కె.లో పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు.