ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ ఉపశీర్షిక. కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో పాటు లిరికల్ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తున్నది. యూత్‌ఫుల్ లవ్‌ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అన్నారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి, సంగీతం: శ్రీవసంత్, నిర్మాతలు: బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, లహరిధర్, రచన-దర్శకత్వం: కిరణ్ తిరుమలశెట్టి.