టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగ చైతన్య -సమంత సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ప్రత్యేక సందర్భాలలో వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ వీరు చేసే రచ్చ మాములుగా ఉండదు. ఎక్కువగా గోవా వెళ్లే ఈ జంట అక్కడ తమ డ్రీమ్ హౌస్ ను నిర్మించుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారట.
ఇన్నాళ్లకు అది తీరినట్టు తెలుస్తుంది. సముద్రంకు ఒడ్డున అత్యంత అందమైన ప్రదేశంలో ఈ డ్రీమ్ హౌస్ ను నిర్మించేందుకు సిద్దం అయ్యారట. ఇప్పటికే గోవాకు చెందిన కన్స్ట్రక్షన్ సంస్థ పనులు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే వారి డ్రీమ్ హౌజ్ నిర్మాణం పూర్తి కానుందని సమాచారం. దీనికి చై-సామ్ దంపతులు భారీగానే ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ముంబైలో కూడా ఓ అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేయాలని ఈ దంపతులు భావించినట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే చైతన్య ఇప్పటికే లవ్ స్టోరీ మరియు థ్యాంక్యూ సినిమాలను చేశాడు. ఆ రెండు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇక బాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా సినిమాను కూడా ఈయన చేశాడు. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఆ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెల్సిందే. ఇక సమంత శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది.