‘పూరీ జగన్నాథ్ హీరోయిన్ అనిపించుకోవాలని ఎప్పట్నుంచో కోరిక. ‘ఇస్మార్ట్ శంకర్’కి ఆడిషన్ కూడా ఇచ్చా.. కుదర్లేదు. డబుల్ ఫన్, డబుల్ ఎంటర్టైన్మెంట్ వుండే ఈ ‘డబుల్ ఇస్మార్ట్’లో అవకాశం దొరికింది. చెప్పలేనంత ఆనందంగా ఉంది. పూరీ అద్భుతమైన విజన్ ఉన్న గ్రేట్ డైరెక్టర్. ఆయన సినిమాలో చేయడమే ఓ గొప్ప విషయం అయితే.. రామ్, సంజయ్‌దత్ లాంటి బిగ్‌స్టార్స్ ఉన్న సినిమాలో భాగం కావడం నిజంగా జాక్‌పాటే’ అని కథానాయిక కావ్యథాపర్ అన్నారు.
రామ్ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో ఛార్మీతో కలిసి నిర్మించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. బ్లాక్బాస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’కి స్వీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులో ఓ కథానాయికగా నటించిన కావ్యథాపర్ మంగళవారం విలేకరులతో ముచ్చటించింది. ‘ఇందులో నాది బోల్డ్ అండ్ స్ట్రాంగ్ కేరక్టర్. అలాగే స్మార్ట్‌నెస్, ఇన్నోసెన్స్ కూడా ఉంటుంది.
ఇందులో ఫైట్స్ కూడా చేశా. రామ్ హైలీ ఎనర్జిటిక్. మా కెమిస్ట్రీ యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది. నా కెరీర్లో బెస్ట్ డ్యాన్స్ ఇందులోనే ఇచ్చాను. అలాగే సంజయ్దత్సార్తో నటించడం మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. పేరుకు తగ్గట్టే ‘డబుల్ ఇస్మార్ట్’ డబుల్ బ్లాక్‌బస్టర్ అవుతుంది’ అని నమ్మకం వ్యక్తం చేసింది కావ్య థాపర్.