The RajaSaab Premieres | టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ హారర్ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’. సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ సినిమా గురించి చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సినిమా విడుదల కంటే ఒకరోజు ముందే ‘రాజా సాబ్’ సందడి మొదలుకానుందని ఆయన క్లారిటీనిచ్చాడు. వాస్తవానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే అభిమానుల కోరిక మేరకు జనవరి 8వ తేదీనే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నట్లు నిర్మాత ప్రకటించారు. దీంతో డార్లింగ్ ప్రభాస్ వింటేజ్ లుక్‌ను వీక్షించేందుకు ఫ్యాన్స్ ఒకరోజు ముందే థియేటర్ల వద్ద సందడి చేయనున్నారు. ఇక సినిమా ప్రచారాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ భారీ ప్లాన్ చేస్తోంది. త్వరలోనే హైదరాబాద్‌లోని ఒక ఓపెన్ గ్రౌండ్లో అత్యంత వైభవంగా ‘ది రాజాసాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన తేదీని, వేదిక వివరాలను మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
మరోవైపు ఇప్పటికే ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసిన ‘సహనా.. సహనా..’ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తమన్ అందించిన స్వరాలు, ప్రభాస్ స్టైలిష్ లుక్స్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ఈ పాట విడుదలతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి.